Dussehra Celebrations: దసరా వేడుకల చివరి రోజు అమ్మవారిని పలుచోట్ల ఘనంగా ఊరేగించారు. విజయవాడ పటమటలోని గణపతి సచ్చిదానంద దత్తపీఠంలో వేడుకలు నిర్వహించారు. మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని పూర్ణకళా రాజరాజేశ్వరిగా అలంకరించారు. శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. 101 కొబ్బరికాయలతో విశేషార్చన జరిపారు . పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శమీ వృక్ష పూజలో పాల్గొన్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వాహణ:ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో.. శక్తి స్వరూపిణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోనసీమ జిల్లాలో దుర్గాదేవి ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖలోని షిర్డీ సాయిబాబా ధాన్య మందిరంలో .. కాశీ హరిద్వార్ నుంచి తెచ్చిన రుద్రాక్షాలతో అభిషేకం నిర్వహించారు. బాబా 104వ మహా సమాధి పుణ్య తిథి కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు . పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్ర నిర్వహించారు.