ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PETROL PRICES: ఖజానాకు ఇం‘ధనమే’.. 2021-22లో రాష్ట్రానికి రూ. 14,724 కోట్లు - latest news in ap

PETROL PRICES: పెట్రో ఉత్పత్తుల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నా.. వీటి అమ్మకాలు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాల ఖజానాలకు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 7.74 లక్షల కోట్లు జమ అయ్యాయి.. 2020-21 సంవత్సరంతో పోలిస్తే.. ఇది 15.12% అధికం.

PETROL PRICES
PETROL PRICES

By

Published : Jun 28, 2022, 9:04 AM IST

PETROL PRICES: పెట్రో ఉత్పత్తుల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నా వీటి అమ్మకాలు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాల ఖజానాలకు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 7.74 లక్షల కోట్లు జమ అయ్యాయి.. 2020-21 సంవత్సరంతో పోలిస్తే.. ఇది 15.12% అధికం. వసూలైన మొత్తంలో కేంద్ర వాటా 64%.. రాష్ట్రాల వాటా 36% ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సహా కొన్ని రాష్ట్రాలు తమ పన్నులను తగ్గించుకున్నా రాబడి రూ. 1.02 లక్షల కోట్లు పెరిగింది. ఏడాదిలో కేంద్ర పన్నుల్లో వృద్ధి 8.20% ఉండగా.. రాష్ట్రాల పన్నుల్లో వృద్ధి 29.62% నమోదైంది. మొత్తం రాబడిపరంగా చూస్తే సింహభాగం కేంద్రానికే దక్కుతోంది. రాష్ట్ర ఖజానాకు 2021-22 సంవత్సరంలో రూ. 14,724 కోట్లు జమయ్యాయి. 2019-20 సంవత్సరంతో పోలిస్తే.. రాష్ట్ర పన్నులపై వసూలయ్యే మొత్తం రూ. 4,556 కోట్లు పెరిగింది. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌పై పన్ను బాదుడు అధికంగా ఉండటమే దీనికి కారణం. అందుకే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. మేమేమీ పెంచలేదంటూనే.. రాష్ట్రం వినియోగదారుల్ని బాదేస్తోంది.

2019 సంవత్సరంలో లీటరు పెట్రోలుపై 31% వ్యాట్‌, లీటరుకు రూ.2 చొప్పున అదనపు వ్యాట్‌, డీజిల్‌పై 22.25% వ్యాట్‌, లీటరుకు రూ. 2 చొప్పున అదనపు వ్యాట్‌ ఉండేవి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదనపు వ్యాట్‌ను లీటరుకు రూ. 2 చొప్పున పెంచడంతోపాటు రోడ్డు అభివృద్ధి సుంకం రూపంలో లీటరుకు రూ. 1 (దీనిపై వ్యాట్‌ అదనం) చొప్పున వడ్డించింది. వీటన్నిటి నేపథ్యంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెరిగింది. 2019-20తో పోలిస్తే.. 2020-21లో రూ.846 కోట్లు అధికంగా వచ్చింది. మొత్తంగా చూస్తే 2021-22 సంవత్సరంలో ఏకంగా 3,719 కోట్ల పెరుగుదల నమోదైంది. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం రెండు దఫాలుగా ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించుకుంది. దీంతో కొన్ని రాష్ట్రాలు తామూ సిద్ధమంటూ పన్నుల్ని తగ్గించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం పైసా కూడా తగ్గించలేదు. పైగా కేంద్రం తగ్గించడం వల్ల తమ ఆదాయం పడిపోతోందని పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details