ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టులో ధూళిపాళ్ల అత్యవసర పిటిషన్​..ఇవాళ విచారణ - ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

సంఘం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణన్​ హైకోర్టులో అత్యవసరంగా వ్యాఖ్యం దాఖలు చేశారు. ఎఫ్​ఐఆర్​ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.

dulipalla narendra petition on high court
హైకోర్టులో ధూళిపాళ్ల నరేంద్ర అత్యవసర పిటిషన్ దాఖలు

By

Published : Apr 27, 2021, 7:22 AM IST

సంఘం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణన్ హైకోర్టులో అత్యవసరంగా వ్యాఖ్యం దాఖలు చేశారు. ఆర్థిక, పరిపాలనాపరమైన అక్రమాలకు పాల్పడ్డామనే ఆరోపణతో.. ఈ నెల 22న అవినీతి నిరోధక శాఖ తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని వ్యాఖ్యంలో కోరారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. తమను జ్యుడీషియల్ రిమాండ్​కు పంపుతూ విజయవాడలోని 8వ అదనపు జిల్లా కోర్టు ఈ నెల 23న జారీచేసిన ఉత్తర్వులను కొట్టేసి, బెయిలు మంజూరు చేయాలని.. మరో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి.. జస్టిస్ ఆర్.రఘునందన్ రావు విచారణ జరిపేందుకు అనుమతి ఇచ్చారు. ఈ వ్యాజ్యాలపై ఇవాళ న్యాయమూర్తి విచారణ జరపనున్నారు. తమపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారని.. పిటిషన్లలో పేర్కొన్నారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవటానికి ఏసీబీ చట్టం కింద కేసు నమోదు చేశారని.. ఇది చట్టవిరుద్ధమని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details