ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బల్దియా నిర్లక్ష్యం, ద్విచక్రవాహనంపై చెట్టు కొమ్మ పడి చిన్నారికి గాయాలు - Ghmc Negligency Girl Injured

Ghmc Negligency Girl Injured హైదరాబాద్​లో జీహెచ్​ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ కుటుంబానికి పెనుప్రమాదం తప్పింది. మలక్‌పేట రహదారికి ఆనుకొని ఉన్న చెట్టుకొమ్మలు జీహెచ్​ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. ​ఇదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కుటుంబంపై చెట్టుకొమ్మ పడింది. ఈ క్రమంలో వాహనంపై ప్రయాణిస్తున్న చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

Ghmc Negligency Girl Injured
జీహెచ్​ఎంసీ అధికారుల నిర్లక్ష్యం

By

Published : Aug 27, 2022, 8:46 PM IST

Ghmc Negligency Girl Injured: హైదరాబాద్​ మలక్‌పేట రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్నఓ కుటుంబానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. చెట్టుకొమ్మ పడడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి ఈ విధంగా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా మలక్‌పేట రహదారికి ఆనుకొని ఉన్న చెట్టుకొమ్మలు తొలగిస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనంపై చెట్టు కొమ్మ పడడంతో బాలిక గాయపడింది.

పనులు జరుగుతున్నట్లుగా జీహెచ్‌ఎంసీ అధికారులు.. ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బాలిక తండ్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోకుండా ఇలా పనులు ఎలా చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలకు అడ్డుగా ఉంటాయని జీహెచ్‌ఎంసీ అధికారులు రహదారికి అడ్డుగా ఉన్న చెట్టుకొమ్మలను కొట్టివేసేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులను స్థానికులు కోరారు.

జీహెచ్​ఎంసీ అధికారుల నిర్లక్ష్యం

ఇవీ చదవండి:ఇంజినీర్​ ఇంట్లో విజిలెన్స్ దాడులు, గుట్టలుగా నోట్ల కట్టలు

ABOUT THE AUTHOR

...view details