Love marriage: వాళ్లిద్దరికి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ. కలిసి జీవింతాంతం బతుకుదాం అనుకున్నారు. ఇద్దరికి ఒకే కులమైనా పెద్దలను ఒప్పుకోలేదని ఎదిరించి వివాహం చేసుకున్నారు. అనంతరం వేరే ఊరిలో నివాసం ఉంటున్నారు. ఇలా హాయిగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలోకి కుల పెద్దలు ప్రవేశించారు. మీరు గ్రామానికి వస్తే అందరి ముందు మరోసారి పెళ్లి జరిపిస్తామని అన్నారు. వారి మాటలు నమ్మిన దంపతులు ఇంటికి వచ్చారు. ఇక్కడే కుల పెద్దలు అసలైన ట్విస్ట్ ఇచ్చారు.
తెలంగాణలోని జనగామ జిల్లా పెద్దపహడ్ గ్రామానికి చెందిన దండు సాయికుమార్ (24), గోపిరాజుపల్లికి చెందిన భాగ్యలు ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం అయినా పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి మే13 2022న ఇరువురు వివాహం చేసుకున్నారు. అనంతరం భువనగిరిలో దంపతులు నివాసం ఉంటున్నారు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో తల్లిదండ్రులు, కుల పెద్దలు వివాహం చేస్తామని వీరిని గ్రామానికి పిలిపించారు.
వారి మాటలు నమ్మిన దంపతులు గ్రామానికి వచ్చారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కుల పెద్దలు భాగ్య పేరిట వ్యవసాయ భూమిని అబ్బాయి తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేయాలని తీర్మానించారు. ఇందుకు సాయికుమార్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఆ తర్వాత కుల పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేయాలని నిర్ణయించారు. కానీ భాగ్య తల్లిదండ్రులు ఆమెకు మరో వివాహం చేయాలని ప్రణాళిక వేశారు.