ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'144 సెక్షన్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అందలేదు' - 144 సెక్షన్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మాకు రాలేదు

అమరావతిలో 144 సెక్షన్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తమకు అందలేదని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలు కేవలం జమ్ముకశ్మీర్‌కే పరిమితమన్నారు. రైతులే కవాతు చేసి తమని రెచ్చగొట్టారన్న డీఎస్పీ.. పోలీసులపై దాడి చేసిన వారినే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

dsp-srinivas-comments-on-144-section
dsp-srinivas-comments-on-144-section

By

Published : Jan 11, 2020, 3:06 PM IST

'144 సెక్షన్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మాకు రాలేదు'

అమరావతిలో 144 సెక్షన్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తమకేమీ రాలేదని గుంటూరు జిల్లా తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలు కేవలం జమ్ముకశ్మీర్‌కే పరిమితమన్నారు. రైతులే కవాతు చేసి తమని రెచ్చగొట్టారన్న డీఎస్పీ.. వారిపై దాడిచేసిన వారినే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రైతులు నిర్బంధించిన వ్యక్తి పోలీసా కాదా అనేది నిర్ధారించాల్సి ఉందన్నారు. తాము కూర్చోకుండా అరుగులపై గుర్తు తెలియని వ్యక్తులు తారు పోశారని తెలిపారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details