"కొత్త జిల్లా కేంద్రాల్లో ఉన్నతాధికారులు...డ్రైరన్ నిర్వహించాలి" - dry run on new districts opening
కొత్త జిల్లాల ఆవిర్భావ సమయంలో డ్రైరన్ నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడే సమయంలో ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘డ్రైరన్’లో ప్రణాళిక రూపొందించుకోనున్నారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఆవిర్భావ సమయంలో జిల్లా ఉన్నతాధికారులు నిర్ధిష్ట కార్యాచరణతో సిద్ధమయ్యేలా ‘డ్రైరన్’ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ నాలుగో తేదీన ఉదయం కొత్త జిల్లా కేంద్రాల్లో అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నిర్దేశిత సమయంలో ముఖ్యమంత్రి జగన్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమావేశమవుతారు. సీఎం మాట్లాడే సమయంలో ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘డ్రైరన్’లో ప్రణాళిక రూపొందించుకోనున్నారు. జిల్లాల ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించనున్నారు. కార్యాలయాల కోసం ఎంపిక చేసిన భవనాలను శనివారానికల్లా సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి జిల్లా కేంద్రాలకు ఆదేశాలు వెళ్లాయి. కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపును శనివారం నుంచి ప్రకటించే అవకాశముంది. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు తగ్గట్టు నియామకాలకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
ఇదీ చదవండి: New Districts: ఏయే ప్రాంతాలు.. ఏయే జిల్లాలోకి