మద్యం తాగి వాహనం నడపడం ఎంత ప్రమాదమో తెలిసినా.. కొందరు మందుబాబులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తుంటారు. వారు రోడ్లపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ.. ప్రమాదాలకు కారకులవుతారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గేటు వద్ద ఓ ద్విచక్రవాహనదారుడు హంగామా సృష్టించాడు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేసే సరదా మీమ్స్ కూడా మనం చూస్తుంటాం. ఇదే ఘటనకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు "కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో" అని ట్వీట్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు కొద్దిసేపు ఆ మందుబాబు భయాందోళనకు గురి చేశాడు. ఈ వీడియో నవ్వు తెప్పిస్తున్నా.. తాగి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
DRUNKEN DRIVER: కృష్ణగాడి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో.. - telangana varthalu
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గేటు వద్ద.. ఓ మందుబాబు హంగామా సృష్టించాడు. తాగి వాహనదారులకు భయాందోళనకు గురి చేశాడు. అయితే, ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు "కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో" అని ట్వీట్ చేశారు. తాగి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కృష్ణగాడి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో..