మత్తుకు అలవాటు పడిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి వద్ద ఆబ్కారీ పోలీసులు 12 ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్ డ్రగ్స్Drugs seized in medchal)ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడాకు చెందిన సాయికిరణ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరం నుంచే మత్తుకు అలవాటు పడిన సాయికిరణ్.. గోవా నుంచి రెండు నెలలకు సరిపడా మత్తుపదార్థాలు తెచ్చుకునేవాడు.
ముందస్తు సమాచారం ప్రకారం సాయికిరణ్‌ను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు అతని నుంచి రూ.50వేలు విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేశారు. మత్తుకు అలవాటు పడి అతను బీటెక్‌ను మధ్యలోనే ఆపివేసినట్లు ఆబ్కారీ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. నగరంలోని విద్యాసంస్థలు, రేవ్ పార్టీలు, ఫామ్‌హౌజ్‌ల వద్ద తరచూ ఆబ్కారీ తనిఖీలు జరుగుతాయని.. మత్తు పదార్థాల వాడకం కట్టడికి కఠిన చర్యలు చేపడుతున్నామని వివరించారు.