ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ నెల 8న.. హైదరాబాద్​లో తాగునీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్​లో ఈనెల 8న ప‌లుచోట్ల తాగునీటి స‌ర‌ఫ‌రాలో పాక్షిక అంత‌రాయం ఏర్పడనున్నట్లు జలమండలి ప్రకటించింది. విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో తాగునీటికి అంతరాయం కలుగనున్నట్లు వెల్లడించింది.

water bundh
హైదరాబాద్​లో తాగునీటి సరఫరాకు అంతరాయం

By

Published : Mar 6, 2021, 6:43 AM IST

హైదరాబాద్ నగరంలో ఈనెల 8న ప‌లుచోట్ల తాగునీటి స‌ర‌ఫ‌రాలో పాక్షిక అంత‌రాయం ఏర్పడనున్నట్లు జలమండలి ప్రకటించింది. విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో తాగునీటికి అంతరాయం కలుగనున్నట్లు వెల్లడించింది. సంతోశ్​నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, ఆస్మన్​ఘడ్, యాకుత్​పుర, మహబూబ్​మాన్షన్, నారాయణగూడ, బొగ్గులకుంట, అడిక్​మెట్, శివం రోడ్, చిలకలగూడ, రియాసత్‌నగర్, అలియాబాద్, మిరాలం, బీఎన్ రెడ్డి నగర్, ఆటోనగర్, వనస్థలిపురం సరఫరాలో అవాంతరాలు ఏర్పడతాయని పేర్కొంది.

వీటితో పాటు మారుతీనగర్, ఏలుగుట్ట‌, హబ్సిగూడ‌, నాచారం, బోడుప్ప‌ల్, తార్నాక‌, లాలాపేట్, మారేడ్​ప‌ల్లి, కంటోన్మెంట్, ఎమ్ఈఎస్, ప్రకాశ్​నగర్, మేకల మండి, బాలాపూర్, మైసారం, సాహెబ్​నగర్, మైలార్ దేవ్ ప‌ల్లి, బండ్ల గూడ, పీడీపీ, గోల్డెన్ హైట్స్, సులేమాన్ నగర్, 9 నెంబర్ బోజగుట్ట, ఆళ్లబండ, గంధం గూడ, ఆసిఫ్ నగర్, ప్రశ్సన్ నగర్, మాదాపూర్, షేక్​పేట్ రిజర్వాయర్ ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు చెప్పారు. నగరంలోని వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది.

ABOUT THE AUTHOR

...view details