గ్రామాల్లో కోతుల బెడదను తట్టుకోలేక తెలంగాణ నల్గొండ జిల్లాలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి సర్పంచ్ బాలరాణి రాజాసింగ్ వినూత్న ఆలోచన చేశారు. కోతులను భయపెట్టడం కోసం పంచాయతీ సిబ్బందికి ఎలుగుబంటి వేషం వేశారు. కోతులను గ్రామం నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సర్పంచ్ అన్నారు.
సర్పంచ్ వినూత్న ఆలోచన.... ఎలుగుబంటిలా మారిన సిబ్బంది! - bear getup to chase monkeys news
గ్రామంలో ఉన్న కోతుల బెడదను పోగొట్టడానికి ఆ సర్పంచ్ వినూత్నంగా ఆలోచించారు. వానరులను ఊరు నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా ఎలుగుబంటి వేషాన్ని తెరపైకి తెచ్చారు.
ఎలుగుబంటి వేషంలో సిబ్బంది
కోతులు ఉన్న చోట తిప్పడం వల్ల పరారీ అవుతున్నాయని పేర్కొన్నారు. ఎలుగుబంటి వేషం వేసిన వ్యక్తి వెంబడి పిల్లలు సరదాగా పరుగులు పెట్టారు.