Condolence to Mekapati Goutham Reddy: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి.. నివాళులు అర్పించారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని గౌతమ్ నివాసానికి వెళ్లిన సతీశ్ రెడ్డి.. ఆయన భౌతికకాయనికి పుష్పగుచ్చాలతో అంజలి ఘటించారు.
అనంతరం మేకపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రిగా గౌతమ్ రెడ్డి విశిష్ట సేవలందించారని సతీశ్‌రెడ్డి కొనియాడారు. ఈ రోజు ఉదయం గౌతమ్‌రెడ్డికి గుండెపోటు రావడంతో ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.