ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డాక్టర్‌ సుధాకర్ కేసు: హైకోర్టుకు సీబీఐ నివేదిక సమర్పణ - Dr. Sudhakar case hearings in HC

డాక్టర్‌ సుధాకర్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. విస్తృత దర్యాప్తు కోసం సీబీఐ అధికారులు అనుమతి కోరారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది.

డాక్టర్‌ సుధాకర్ కేసు
డాక్టర్‌ సుధాకర్ కేసు

By

Published : Apr 6, 2021, 6:23 PM IST

విశాఖ డాక్టర్‌ సుధాకర్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. రెండో నివేదికను హైకోర్టుకు సీబీఐ సమర్పించింది. విస్తృత దర్యాప్తు కోసం సీబీఐ అధికారులు అనుమతి కోరారు. రెండో నివేదికను తమకు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు.

ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. నివేదిక అమికస్ క్యూరీకి కావాలా అని హైకోర్టు అడిగింది. సీబీఐ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని అమికస్ క్యూరీ కోరారు. ఉన్నతాధికారుల అభిప్రాయం తీసుకుని నిర్ణయం చెబుతామని సీబీఐ స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details