Malakpet hit and run case update: హైదరాబాద్ మలక్‌పేట హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన డాక్టర్ శ్రావణి మృతి చెందారు. మూడు రోజులుగా నిమ్స్‌లో మృత్యువుతో పోరాడిన శ్రావణి ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. తలకు బలమైన గాయం కావడంతో బాధితురాలికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయినా ప్రాణం దక్కలేదు. 25 రోజుల కిందట గుండెపోటుతో శ్రావణి తల్లి మృతి చెందారు. శ్రావణి మృతితో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. హస్తినాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రావణి దంత వైద్యురాలిగా పని చేస్తున్నారు.
హిట్ అండ్ రన్ కేసు.. చికిత్స పొందుతూ వైద్యురాలు మృతి - మలక్‌పేట హిట్ అండ్ రన్ కేసు తాజా వార్తలు
Malakpet hit and run case update: హైదరాబాద్ మలక్‌పేట హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన డాక్టర్ శ్రావణి మరణించారు. మూడు రోజులుగా నిమ్స్‌లో మృత్యువుతో పోరాడిన ఆమె ఇవాళ ప్రాణాలు విడిచారు. 25 రోజుల కిందట గుండెపోటుతో శ్రావణి తల్లి మృతి చెందారు.
మలక్‌పేట హిట్ అండ్ రన్ కేసు
ఇదిలా ఉండగా.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా శ్రావణిని ఢీకొట్టి పరారైన నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఓల్డ్ మలక్‌పేటకు చెందిన 19 ఏళ్ల ఇబ్రహీంను అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. నిందితుడుకి లైసెన్స్, కారుకు పేపర్లు కూడా లేవని పోలీసులు తెలిపారు.