మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి వైద్యుడు సత్యేంద్ర మిశ్రాను హైదరాబాద్‌కు తరలించారు. ఎయిర్ అంబులెన్స్‌లో భోపాల్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. ఏడాదిపాటు బుందేల్‌ఖండ్‌లో కొవిడ్ రోగులకు చికిత్స అందించిన సత్యేంద్ర మిశ్రా సాగర్.. ఇటీవల కరోనా బారినపడ్డారు. కొవిడ్‌తో 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు పేర్కొన్నారు. మిశ్రాకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు.
మధ్యప్రదేశ్ డాక్టర్‌కు కరోనా.. హైదరాబాద్‌కు తరలింపు - secunderabad news
ఏడాది పాటు కొవిడ్ రోగులకు చికిత్స అందించిన మధ్యప్రదేశ్‌లోని ఓ డాక్టర్.. ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయన ఊపిరితిత్తులు 80 శాతం దెబ్బతిన్నాయి. మెరుగైన చికిత్స కోసం ఆయనను (తెలంగాణ) హైదరాబాద్‌కు తరలించారు.
కరోనా బారిన పడిన మధ్యప్రదేశ్ డాక్టర్.. హైదరాబాద్‌కు తరలింపు