రోగ నిరోధక శక్తి ఉన్న వారు వయసుతో పని లేకుండా ప్రాణాలు దక్కించుకుంటున్నారు. లేని వారు కాలం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల్లో స్వీయ నియంత్రణ కనిపించటం లేదు. ఎండవేడిమి, వెలుతురు కోసం బయటకు వస్తూనే ఉన్నారు. ఇక్కడ పోలీసులు సౌమ్యంగా వ్యవహరించటంతో వారిలో భయాందోళన కనిపించటం లేదు.
ఇక్కడి వారికి స్వీయ నియంత్రణ కొరవడింది : డా. అపర్ణ
బ్రిటన్ ఆస్పత్రుల్లోని పడకల సంఖ్యకు రెండు మూడింతల మంది కరోనా వైరస్ బాధితులు వస్తున్నారు. ఆస్పత్రిలో చేర్చుకోవాల్సిన వారిని ఎంచుకోవాల్సి రావటం కలచివేస్తుంది. ఈ విషయంలో మనసుకి సమాధానం చెప్పటం సాధ్యం కావటంలేదు. అయినా తప్పని పరిస్థితి’ అన్నారు వెస్ట్ మిడ్‌ల్యాండ్‌లో పని చేస్తున్న డాక్టర్ అపర్ణ యలమంచిలి.
వైరస్‌తో డాక్టర్లు కూడా పోరాడుతున్నారు
కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేయటం అన్నది వైద్యులకూ ప్రాణాంతకంగానే ఉంది. వైరస్ సోకిన వారే కాదు.. డాక్టర్లు కూడా దాంతో పోరాడుతున్నారు. పలువురు మరణించారు. రేపు విధులు నిర్వహించగలమా? లేదా? అన్న అనుమానంలో చాలా మంది వైద్యులు వీలునామాలు కూడా రాస్తున్నారు. ఇది ఆవేదన కలిగించే పరిణామం. వైద్యులకు అవసరమైన రక్షణ ఉపకరణాలను పెంచాలని బంగ్లాదేశ్‌కు చెందిన ఓ సీనియర్ డాక్టర్ బ్రిటన్ ప్రధానికి లేఖ రాశారు. ఆ లేఖ రాసిన డాక్టర్ వైరస్‌తో రెండు రోజుల కిందట మరణించటం కలచివేసింది.
TAGGED:
dr.Aparna