ప్రముఖ మిఠాయి దుకాణం యాజమాని పుల్లారెడ్డి మనువడిపై వరకట్నం, గృహహింస కేసు నమోదైంది. పుల్లారెడ్డి మనువడు ఏక్‌నాథ్ రెడ్డిపై అతని భార్య హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఏక్నాథ్రెడ్డి దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. వీరుంటున్న భవనంలోని పైఅంతస్తు నుంచి తన భార్య కిందకు రాకుండా బంధించాలని ఏక్‌నాథ్ రెడ్డి తలచాడు. మెట్ల వద్ద.. రాత్రికి రాత్రే అడ్డు గోడ కట్టించాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.
ఇదంతా గ్రహించిన బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. వెంటనే స్పందించిన పంజాగుట్ట పోలీసులు.. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెకు బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాధితురాలు.. తన తండ్రితో కలిసి ఠాణాకు వచ్చి ఏక్‌నాథ్ రెడ్డిపై వరకట్న వేధింపులతో పాటు గృహహింసకు పాల్పడుతున్నాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.
ఇవీ చూడండి: