ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Over Thinking Problems: అతిగా ఆలోచించకండి.. అలసిపోతారు - over thinking problems latest news

Over Thinking Problems: ఎప్పుడూ ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారం వెతకాలి. అంతేకానీ అదేపనిగా ఆలోచిస్తూ ఉంటే ఎలా! ఇలా ఆలోచించడం వల్ల ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయో తెలుసుకోండి.

Over Thinking Problems
అతిగా ఆలోచించకండి

By

Published : Oct 18, 2022, 9:30 AM IST

Over Thinking Problems: ఎక్కువ పని చేస్తే శరీరం ఎలా అలసిపోతుందో.. ఎక్కువగా ఆలోచించినా సరే అలసిపోతారట! శారీరకంగా అలసిపోతే ఓ కునుకు తీసి, కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కానీ అతిగా ఆలోచించడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. దీనికి పరిష్కార మార్గాలేవో తెలుసుకుందామా!

* అతి ఏ విషయంలోనూ అంత మంచిది కాదంటారు. నిజమే ఎక్కువగా ఆలోచించడం వల్ల వర్తమానంలో జీవించే సమయాన్ని, అవకాశాన్ని కోల్పోతారు.

* పదే పదే ఆలోచించడం వల్ల చేస్తున్న పని మీద ధ్యాస ఉండదు. దీంతో అన్ని పనులు ఆలస్యమవుతాయి.

* ఆలోచన తిండిమీద కూడా ప్రభావం చూపుతుంది. సరిగా ఆకలి వేయదు. కాస్త తినగానే చేయి కడిగేస్తారు. మరికొందరికి భోజనం మీద ధ్యాసే ఉండదు.

* ఎప్పుడూ ముభావంగా ఉంటారు. చుట్టుపక్కల వారితో కలవలేరు. దీంతో ఒంటరితనం ఆవహిస్తుంది. మానసికంగా కుంగిపోతారు.

* సమస్య చిన్నదైనా, పెద్దదైనా పరిష్కారం కోసం వెతికినప్పుడు మాత్రమే ఆలోచించడం ఉత్తమమైన పద్ధతి. అలా కాకుండా రోజంతా అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే సమయం వృథా అవుతుందే తప్ప ఫలితం ఉండదు.

* ఎప్పుడూ ముభావంగా ఉండటం, నలుగురితో ఉండకపోవటం వల్ల ఇతరులకి మీ మీద వ్యతిరేక భావం ఏర్పడుతుంది.

* మీ ప్రవర్తనను బట్టి ఇతరులు మీ పరిస్థితిని అంచనా వేస్తూ ఉంటారు. మీకు సమస్యలు ఉన్నాయనే విషయం ఇతరులకు తెలియకపోవడమే మంచిది. అందువల్ల ఇతరుల ముందు దిగులుగా ఉండకండి.

* ఎన్ని సమస్యలు ఉన్నా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అంటుంటారు. అందువల్ల చింతించకండి.

* ప్రశాంతంగా ఉండండి. దీనివల్ల ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది. సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలుగుతారు.

జరిగిన, జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ప్రస్తుత క్షణాలను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లండి. ఎలాంటి సవాళ్లనయినా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి. ఆనందమైన జీవితం మీ సొంతమవుతుంది.

ABOUT THE AUTHOR

...view details