మూడు రాజధానులు ఎక్కడా సక్సెస్ కాలేదని ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వాటితో అభివృద్ధి చెందదన్నారు. నా కంటే చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నా...ఆలోచించి నిర్ణయం తీసుకోండని వేడుకున్నారు.
రాజధానికి డబ్బులెందుకు..
అమరావతి ప్రాజెక్టు వల్ల అనేక సంస్థలు వచ్చాయని చంద్రబాబు స్పష్టం చేశారు. 45000 కోట్ల పెట్టుబడులు వచ్చేవని వ్యాఖ్యానించారు. అన్ని అవసరాలకు పోనూ తర్వాత పదివేల ఎకరాల భూమి ఉందన్నారు. రాజధాని నిర్మించడానికి డబ్బులు అవసరం లేదన్నారు. అమరావతికి ఉన్న బలంతోనే బాండ్లు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ను ఇదే మాదిరిగా ఎగతాళి చేశారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి నేను మెుదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేశారన్నారు. మీరు కూడా అలానే అమరావతిని పూర్తి చేయండని ముఖ్యమంత్రికి సూచించారు.