ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాఠశాలల్లో సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దు: సీఎం జగన్ - నగదు బదిలీ

గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్ఠికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.

సీఎం జగన్

By

Published : Oct 3, 2019, 8:34 PM IST

Updated : Oct 3, 2019, 9:49 PM IST

మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిపై ప్రతిపాదనలు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచటంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం సహా పౌష్ఠికాహారంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు సురేష్, తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరో 65 సెంట్రలైజ్డ్‌ కిచెన్స్‌ ఏర్పాటుపైనా సీఎం చర్చించారు. గర్భిణీలు, పిల్లల తల్లులకు, చిన్నారులకు పౌష్ఠికాహారంపై వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్ఠికాహారం తప్పక అందించాలని సీఎం ఆదేశించారు. వీటిలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో విస్తృతంగా చర్చించిన సీఎం... వీరికి నగదు బదిలీ చేసే అంశంపైనా సమాలోచనలు చేశారు. తల్లులు, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలన్న ఆయన.. వీటన్నింటిపైనా ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలని ఆదేశించారు.


స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధికార్యక్రమాలపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నవంబర్‌ నుంచి స్కూళ్లలో పనులు ప్రారంభించి మార్చికల్లా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. మొదటి దశలో సుమారు 15 వేలకుపైగా స్కూళ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఖర్చు పది రూపాయలు ఎక్కువైనా సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దని సీఎం సూచించారు. ముందుగా అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి స్కూలు యూనిఫారమ్స్, పుస్తకాలు అందించాలని సీఎం ఆదేశించారు.

Last Updated : Oct 3, 2019, 9:49 PM IST

ABOUT THE AUTHOR

...view details