ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా.. డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకగ్రీవం - news on mlc

డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని... ఆయనే భర్తీ చేశారు. వైకాపా ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

dokka manikya vara prasad elected as mlc
ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్

By

Published : Jun 29, 2020, 7:34 PM IST

వైకాపా ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన రాజీనామాతోనే ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన స్థానాన్ని.. తిరిగి ఆయనే దక్కించుకున్నారు. రిటర్నింగ్ అధికారి నుంచి ఎమ్మెల్సీగా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఆయనతో కలిపి.. శాసన మండలిలో వైకాపా సభ్యుల సంఖ్య 10కి చేరింది.

తెదేపా ఎమ్మెల్సీగా గతంలో ఉన్న ఆయన.. పార్టీ మారిన సందర్భంలో పదవికి రాజీనామా చేశారు. నాలుగు రోజుల క్రితం వైకాపా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ స్థానం కోసం మరెవరూ నామపత్రాలు వేయని కారణంగా.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ABOUT THE AUTHOR

...view details