వైద్యాధికారులు, ఉన్నతాధికారుల వల్ల తరచూ అవమానాలు, దూషణలకు గురవుతున్నట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. కొవిడ్-19 విధుల్లో పనిచేసే వాతావరణం లేనందున వైద్యులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వైద్యుల స్థాయికి తగ్గ గౌరవం ఇవ్వలేని పక్షంలో కొవిడ్-19 విధుల నుంచి తప్పుకొనేందుకు అనుమతివ్వాలని కోరింది. కొత్తగా నియమిస్తున్న వైద్యులు, ఇతర శాఖల ద్వారా సేవలు పొందాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ‘రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ తరచూ వీడియో సమావేశాల ద్వారా ఆచరణ సాధ్యం కాని విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారానికి రెండుసార్లు తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించే సమావేశాలకు వైద్యులు హాజరుకావడం ఇబ్బందికరంగా మారింది. కనీసం 15 రోజులకోసారి వీడియో సమావేశాలు నిర్వహించాలి. టీకాల కార్యక్రమం నూటికి నూరుశాతం ఎక్కడా జరగదు. కొత్త యాప్‌లకు తగ్గట్లు వివరాలు నమోదు చేయడం వైద్యులకు సాధ్యం కావడం లేదు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్వహణ వైద్యాధికారుల బాధ్యతల్లో లేదు.
డీఎంహెచ్‌వోలపై ఒత్తిడి