విశాఖ ఘటనలో దాడికి గురై ప్రస్తుతం ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందుతున్న డా.సుధాకర్ ఎవరి ఆధీనంలో ఉన్నారో తెలపాలంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. సుధాకర్ తల్లి ఈ పిటిషన్‌ను హౌస్ మోషన్లో వేశారు. దీనిపై కోర్టు అనుమతి రాగానే విచారణకు వచ్చే అవకాశముందని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ తెలిపారు.
కాగా మానసిక చికిత్సాలయం నుంచి సుధాకర్‌ను మరో ఆస్పత్రికి మార్చాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై విచారణను ధర్మాసనం సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.