ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నా కుమారుడిని వేరే ఆస్పత్రికి తరలించండి' - వైద్యుడు సుధాకర్ వార్తలు

విశాఖలోని మానసిక ఆస్పత్రి నుంచి వైద్యుడు సుధాకర్​ను వేరే ఆస్పత్రికి తరలించాలని ఆయన తల్లి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ కుమారుడిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.

doctor sudhakar
doctor sudhakar

By

Published : May 29, 2020, 4:41 PM IST

Updated : May 29, 2020, 5:44 PM IST

మీడియాతో మాట్లాడుతున్న సుధాకర్ తల్లి

వైద్యుడు సుధాకర్​ను విశాఖ మానసిక ఆస్పత్రి నుంచి వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని ఆయన తల్లి డిమాండ్ చేశారు. మానసిక ఆస్పత్రిలో చికిత్సపై అనుమానం వ్యక్తం చేశారు. అందుతున్న చికిత్సపై సుధాకర్​లో భయాందోళన మొదలైందని తెలిపారు. ఆరోగ్యం బాగున్న వ్యక్తిని మానసిక ఆస్పత్రిలో చేర్చటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 15 రోజులుగా ఇబ్బంది పెడుతున్నారంటూ సుధాకర్ లేఖ రాశారని... మందుల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పినట్లు వెల్లడించారు.

'ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుంది. వైద్యుడిపై ఇంత కక్ష సాధింపా..? తల్లిగా నా బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.డాక్టర్ రామిరెడ్డికి, నా కుమారుడికి వాగ్వాదం జరిగింది.వైద్యుడు రామిరెడ్డి ఏవేవో మందులిచ్చి ఇబ్బంది పెడుతున్నారు.విశాఖ మానసిక ఆస్పత్రిలో నా కుమారుడికి ప్రాణహాని ఉంది. అందుతున్న చికిత్సపై సుధాకర్ భయాందోళన వ్యక్తం చేశారు. నా కుమారుడికి వేరే ఆస్పత్రిలో చికిత్స చేయించాలి ' - సుధాకర్ తల్లి

డాక్టర్ సుధాకర్ మరో లేఖ

విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్​కు వైద్యుడు సుధాకర్ మరో లేఖ రాశారు. 6వ వార్డు చీఫ్​గా ఉన్న డాక్టర్ రామిరెడ్డి గత 15 రోజులుగా ఎలాంటి వైద్యం అందించటం లేదని.. చిరాకు తెప్పిస్తున్నారని ఆరోపించారు. చికిత్స కోసం మరో యూనిట్​కు తరలించాలని లేఖలో కోరారు.

సుధాకర్ లేఖ


ఇదీ చదవండి:
మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారు: డాక్టర్ సుధాకర్​

Last Updated : May 29, 2020, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details