ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆక్సీ మీటర్, డిజిటల్ థర్మామీటర్ వినియోగంపై సూచనలు

కొవిడ్​ వ్యాప్తితో ప్రజలు వ్యక్తిగత ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పల్స్ ఆక్సీ మీటర్... డిజిటల్ థర్మామీటర్ వంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీటి వినియోగంపై డాక్టర్​ శంకర్​ ప్రసాద్​ సూచనలు ఇచ్చారు.

Dr. Shankar Prasad's interview on the use of oxymeter and digital thermometer at present.
ప్రస్తుతం ఆక్సీ మీటర్, డిజిటల్ థర్మామీటర్ వినియోగంపై డా.శంకర్ ప్రసాద్ ఇంటర్వూ..

By

Published : Aug 6, 2020, 5:27 PM IST

కరోనా మహమ్మారి నుంచి కాపాడునేందుకు ప్రజల్లో వ్యక్తిగత ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరిగింది. హోం ఐసోలేషన్‌లో ఉంటున్నవారు ఇంట్లోనే చిన్న చిన్న వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుకుంటున్నారు. ముఖ్యంగా పల్స్ ఆక్సీమీటర్... డిజిటల్ థర్మామీటర్ వంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరికరాల వినియోగం.. వాటి ఉపయోగాలపై డాక్టర్ శంకర్ ప్రసాద్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

పల్స్‌ ఆక్సిమీటర్‌ రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయిని చూపుతుంది. పల్స్‌ ఆక్సిమీటర్‌లో ఎస్పీఓ-2, పల్స్‌ రేటు తెలుస్తుంది. 95 శాతం కంటే తక్కువ ఉంటే ఆక్సిజన్‌ అందించాలి. వేళ్లకు నెయిల్‌ పాలిష్‌ లేకుండా చూసుకోవాలి. నెయిల్‌ పాలిష్‌ ఉంటే తప్పుడు వివరాలొస్తాయి. కరోనాతో ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. కరోనా సోకితే రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గే ప్రమాదం ఉంది. ఆక్సిజన్‌ స్థాయిని పల్స్ ఆక్సిమీటర్‌తో తెలుసుకోవచ్చు. మొదట కూర్చుని ఆక్సిజన్‌ స్థాయి చూసుకోవాలి. 6 నిమిషాలు నడిచిన తర్వాత మళ్లీ ఆక్సిజన్‌ స్థాయి చూసుకోవాలి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details