మూత్ర పిండాల వైద్య నిపుణులు డాక్టర్ టి.రవిరాజ్ కి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ అవార్డు లభించింది. వైద్య రంగంలో విశేష సేవలకు గుర్తింపుగా అవార్డు వరించింది. దిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖలో వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన.. ఎన్టీఆర్ వైద్యారోగ్య విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలను ప్రత్యేక అధ్యయనం ద్వారా డాక్టర్ రవిరాజ్ నేతృత్వంలో వైద్య నిపుణులు, పరిశోధకుల బృందం గుర్తించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కిడ్నీ బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు, ప్రత్యేక చికిత్సలు ఆయన ఇచ్చిన సిఫార్సులోనివే.
డాక్టర్ రవిరాజ్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ అవార్డు - సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ అవార్డు
వైద్య నిపుణులు డాక్టర్ రవిరాజ్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ అవార్డు దక్కింది. వైద్య రంగంలో విశేష సేవలకు గుర్తింపుగాను కేంద్ర ఆరోగ్యశాఖ ఈ అవార్డును ప్రకటించింది.
sardar vallabhbhai patel national award