Doctor Attacked on phc Senior Assistant: లబ్ధిదారులకు అందాల్సిన కంటివెలుగు నిధులను అక్రమంగా వినియోగించుకున్నారని ఫిర్యాదు చేసినందుకు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు ఓ పీహెచ్సీ డాక్టర్. తనతో పాటు మరో ఇద్దరినీ వెంటపెట్టుకుని ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం పీహెచ్సీలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజశేఖర్.. గతంలో టేకులపల్లి మండలం సులానగర్ పీహెచ్సీలో పనిచేశారు. ఆ సమయంలో తనతో పాటు సీనియర్ అసిస్టెంట్‌గా సత్యప్రసాద్ ఉన్నారు. కంటివెలుగు పథకానికి సంబంధించిన రూ. 2.50 లక్షలను రాజశేఖర్ సొంత ఖర్చులకు వాడుకున్నట్లు సత్యప్రసాద్ గుర్తించారు. వెంటనే ఆ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు.. రాజశేఖర్‌ను 2 నెలల పాటు విధుల నుంచి తొలగించారు.
Doctor Attacked on phc Senior Assistant: ఫిర్యాదు చేసినందుకు పీహెచ్సీ డాక్టర్ నిర్వాకం.. ఇంటికెళ్లి మరీ ఉద్యోగిపై దాడి - doctor attacked on phc employee
Doctor Attacked on phc Senior Assistant: కంటివెలుగు నిధులను అక్రమంగా వాడుకున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు ఓ డాక్టర్. ఆ ఉద్యోగి ఇంటికి వెళ్లి మరీ దురుసుగా ప్రవర్తించారు. ఎందుకిలా చేస్తున్నారని కుటుంబీకులు అడిగినా సమాధానం చెప్పకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆ దృశ్యాలను బాధితుడి కుటుంబీకులు సెల్ఫోన్లో చిత్రీకరించారు.
ఆలస్యంగా వెలుగులోకి
సస్పెన్షన్ ముగిసిన అనంతరం జగన్నాథపురం పీహెచ్‌సీకి రాజశేఖర్ బదిలీ అయ్యారు. సత్యప్రసాద్ జగిత్యాలలో పనిచేస్తున్నారు. తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు సత్యప్రసాద్‌పై కక్ష పెంచుకున్న రాజశేఖర్.. ఆయనపై దాడి చేయాలని నిశ్చయించుకుని సమయం కోసం ఎదురుచూశారు. ఇటీవల సత్యప్రసాద్.. పాల్వంచకు వచ్చినట్లు తెలుసుకున్న డాక్టర్.. తనతో పాటు మరో ఇద్దరిని తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. ఎందుకిలా దాడి చేస్తున్నారని కుటుంబీకులు ప్రశ్నించినా సమాధానమివ్వలేదు. ఆ సన్నివేశాలను వీడియో తీస్తుంటే ఇక చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. జనవరి 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై సత్యప్రసాద్ పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్, కొత్తగూడెం డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.