మెడికల్ పీజీ కౌన్సిలింగ్‌పై జారీ చేసిన జీవో నెం 43లో సవరణ కోరుతూ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఈ నెల 29కు విచారణ వాయిదా వేసింది. జీవో నెంబర్ 43 వలన బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆలా వెంకటేశ్వర్లు అన్నారు.
ఈ విషయంపై.. గతంలో హైకోర్టు నియమించిన కమిటీ నివేదికను కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ప్రజాప్రతినిధులు నియంతలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అలంటి వారి వలన బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 43 జీవోలోని నిబంధనలు సవరించి పీజీ కౌన్సిలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.