గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2020 సంవత్సరంలో ప్రతి పౌరుడికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ... నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాలులో జనవరి 1న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రజలకు గవర్నర్ అందుబాటులో ఉంటారని వెల్లడించారు.
'పుష్పగుచ్ఛాలు వద్దు... పూల మొక్కలు తీసుకురండి' - నూతన సంవత్సర వేడుకలు
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జనవరి 1న మధ్నాహం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే సాధారణ పౌరులు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పవచ్చు. అయితే పుష్పగుచ్ఛాలు మాత్రం తీసుకురావద్దని షరతుపెట్టారు.
సాధారణ ప్రజలు సైతం గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయవచ్చన్నారు. ప్రోటోకాల్ పరిమితులకు మినహాయింపునిస్తూ... ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ప్రజలు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పవచ్చని వెల్లడించారు. కార్యక్రమానికి హాజరయ్యే వారిని భద్రతా పరిమితుల మేరకు రాజ్‌భవన్‌లోకి అనుమతిస్తామన్నారు. సందర్శకులు తమతో ఎలాంటి పుష్పగుచ్ఛాలను తీసుకురావద్దని సూచించారు. కేవలం మొక్కలను మాత్రమే అనుమతిస్తామన్నారు. పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి:'నూతన సంవత్సర వేడుకలకు దూరం ఉందాం'