అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసుల నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేసింది. ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దంటూ సీబీఐ అధికారులు కౌంటర్‌లో పేర్కొన్నారు. సీబీఐ కౌంటర్ దాఖలు చేయడంతో తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.
జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దు: సీబీఐ - జగన్ కేసులో సీబీఐ కౌంటర్
అక్రమాస్తుల కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం చెప్పింది. ఆయనకు హాజరు మినహాయింపు ఇవ్వొద్దంటూ కౌంటర్ దాఖలు చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా పడింది.
సీఎం హోదాలో అధికారిక విధుల్లో పాల్గొనాల్సి ఉన్నందువల్ల ప్రతి వారం విచారణకు రావడానికి ఇబ్బందులున్నాయని... సీబీఐ కోర్టులో 11 ఛార్జిషీట్లపై ప్రతి శుక్రవారం విచారణ జరుగుతున్నందున తన బదులు న్యాయవాది అశోక్‌రెడ్డి హాజరయ్యేలా అనుమతివ్వాలని సీఎం జగన్ పిటిషన్‌లో కోరారు. తన వ్యక్తిగత హాజరు తప్పనిసరని కోర్టు ఆదేశించినప్పుడు హాజరుకు సిద్ధమని చెప్పినా.. కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వివరించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపుపై గతంలో సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించడంతో ముఖ్యమంత్రి జగన్ హైకోర్టును ఆశ్రయించారు.