ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విగ్రహాల ఖర్చు విలువ లేదా ఏపీ ఆవేదన?: దివ్యవాణి - divyavani_on_pm_modi_delhi_dharma_porata_deeksha

విగ్రహాల కోసం ఖర్చు పెట్టినంత విలువ లేదా ఏపీ ప్రజల ఆవేదన... అని దిల్లీ ధర్మపోరాట దీక్షలో మోదీ పై మండిపడ్డారు సినీనటి దివ్యవాణి. మోదీ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహించారు.

దిల్లీ ధర్మపోరాట దీక్షలో దివ్యవాణి

By

Published : Feb 11, 2019, 3:38 PM IST

దిల్లీ ధర్మపోరాట దీక్షలో దివ్యవాణి
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన ప్రధాని మోదీకి అర్థం కావట్లేదా అని సినీ నటి దివ్యవాణి దిల్లీ ధర్మపోరాట దీక్షలో నిలదీశారు. మోదీకి అసలు మాట్లాడే అర్హతే లేదని అన్నారు. కొంత మంది మోసాలనుంచి ఒక కొడుకుగా, అల్లుడిగా నందమూరి వంశాన్ని కాపాడుకున్న ఘనత చంద్రబాబుదన్నారు. విగ్రహాల కోసం ఖర్చుపెట్టినంత విలువ లేదా ఆంధ్ర ప్రజా ఆవేదన అని మండిపడ్డారు. ఏపీ ప్రజల తరఫున హెచ్చరిస్తున్నామని... ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. వయసును సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం కష్టపడుతున్న అలుపెరుగని నాయకుడు చంద్రబాబు అని దివ్యవాణి కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details