ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయ ఉద్యోగాలకు జిల్లా, ప్రాంతీయ స్థాయి కమిటీలు - Secretariat Jobs in AP

వార్డు సచివాలయ ఉద్యోగాలకు జిల్లా, ప్రాంతీయస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయి కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్, ఉపాధ్యక్షుడిగా జాయింట్ కలెక్టర్‌ ఉండనున్నారు.

సచివాలయ ఉద్యోగాలకు జిల్లా, ప్రాంతీయస్థాయి కమిటీలు

By

Published : Sep 17, 2019, 4:41 PM IST

వార్డు సచివాలయ ఉద్యోగాలకు జిల్లా, ప్రాంతీయ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిటీలకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాస్థాయి కమిటీ ఛైర్మన్‌గా పాలనాధికారి, ఉపాధ్యక్షుడిగా సంయుక్త పాలనాధికారి ఉండనున్నారు. జిల్లా కేంద్రం మున్సిపల్ కమిషనర్ కన్వీనర్‌గా, ఇతర కమిషనర్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఫలితాల వెల్లడి, దరఖాస్తుల పరిశీలన, మెరిట్ లిస్టు, రోస్టర్ రూపకల్పన వీటన్నింటినీ ప్రాంతీయ కమిటీకి నివేదించటం లాంటి బాధ్యతలను విశదీకరిస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ చైర్మన్​గా... సూపరింటెండెంట్​ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయి కమిటీ పంపిన ఎంపిక లిస్టు ఆధారంగా... దరఖాస్తులు, డాక్యుమెంట్ల పరిశీలన ఉండనుంది. ఖాళీల గుర్తింపు, నియామక ఆదేశాల జారీ... ఇతర అంశాలపై నిర్ణయాలతో నిర్దేశిత మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇదీ చదవండీ... నరసరావుపేటలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు

ABOUT THE AUTHOR

...view details