ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో 57 మంది జిల్లా, అదనపు జిల్లా జడ్జీల బదిలీ - AP high Court latest news

Judges transfer in ap
ఏపీలో జడ్జీల బదిలీలు

By

Published : Apr 8, 2022, 5:17 PM IST

Updated : Apr 9, 2022, 5:21 AM IST

17:12 April 08

జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

Judges Transfer in AP: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జిలు.. సీనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ.. ఐదుగురు సీనియర్ సివిల్‌ జడ్జిలకు పదోన్నతులు కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా జడ్జిలు ఈనెల 20 లోపు కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పీడీజేలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మరో 42 మంది అదనపు జిల్లా జడ్జిలను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు.

సీనియర్ సివిల్ జడ్జిలుగా పనిచేస్తున్న ఐదుగురు న్యాయాధికారులకు అదనపు జిల్లా జడ్జిలుగా హైకోర్టు పదోన్నతి కల్పించింది. వివిధ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిలుగా పనిచేస్తున్న 23 మంది న్యాయాధికారులను. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టులకు బదిలీ చేశారు. వీరు ఈనెల 22 లోపు కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే 56 మంది జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. వీరు ఈ నెల 25 లోపు కొత్త స్థానంలో బాధ్యతలు తీసుకోవాలని హైకోర్టు తెలిపింది.

  • తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పి.వెంకట జ్యోతిర్మయి
  • కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎన్‌.సలోమన్‌ రాజు
  • పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సి.పురుషోత్తం కుమార్‌
  • చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇ.భీమారావు
  • గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వై.వి.ఎస్‌.పార్థసారథి
  • అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి.శ్రీనివాస్‌
  • కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ సారిక
  • ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎ.భారతి

ఇదీ చదవండి:HC on Village Secretariats: అక్కడ సచివాలయాలు ఇంకా కొనసాగుతున్నాయా? : హైకోర్టు

Last Updated : Apr 9, 2022, 5:21 AM IST

ABOUT THE AUTHOR

...view details