ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ - ఇళ్ల పట్టాల పంపిణీ తాజా సమాచారం

రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో పాలకులు అర్హులకు పట్టాలను అందించారు.

distributions of house lands
విజయవంతంగా ఇళ్ల పట్టాల పంపిణీ

By

Published : Dec 28, 2020, 10:34 PM IST

రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతోంది. పలు జిల్లాల్లోని లబ్ధిదారులకు నాయకులు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

కర్నూలు ..

సొంత ఇల్లు ఒక కళ, ధైర్యం, బలం అని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని చిన్న మల్కాపురం, మల్లేంపల్లి గ్రామంలో పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పాల్గొన్నారు. అర్హులైన పేదలకు బుగ్గన ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం డోన్ పట్టణంలోని డబుల్ రోడ్డు, రహదారి వెడల్పు పనులకు బుగ్గన శంకుస్థాపన చేశారు.

కృష్ణా...

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. దాదాపు 250 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గృహాలకు శంకుస్థాపన నిర్వహించారు.

అనంతపురం..

అనంతపురం జిల్లా గుత్తి, శింగనమల మండలాల్లో పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా పాలకులు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మేల్యే వై.వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రజల పార్టీ, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తూ సీఎం జగన్​ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖ...

విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ విజయవంతంగా జరుగుతోంది. పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నాయకులు పట్టాలను పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండీ...

'పాదయాత్రలో అనేక హామీలిచ్చారు.. ఇప్పుడు విస్మరించారు'

ABOUT THE AUTHOR

...view details