కృష్ణా జిల్లాలో...
జగ్గయ్యపేటలో నూతనంగా మంజూరైన 113 వైఎస్ఆర్ పింఛన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
కడప జిల్లాలో...
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. కడప 47వ డివిజన్ అక్కాయపల్లిలోని మరాటి వీధిలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో నూతన ఒరవడి సృష్టిస్తోందన్నారు.