Engineers: జల వనరులశాఖలో తాజాగా చోటు చేసుకున్న ఇంజినీర్ల బదిలీలు, అదనపు బాధ్యతల అప్పగింత వ్యవహారంపై సీనియరు ఇంజినీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై విజయవాడలో జులై 14న సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సామాజిక మాధ్యమాల వేదికగా సన్నాహాలు చేస్తున్నారు. 1990 పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా జల వనరులశాఖలో ఇంజినీరింగ్ పోస్టులకు ఎంపికైనవారు అత్యవసరంగా సమావేశం కానున్నారు.
Engineers: సీనియర్ ఇంజినీర్లలో అసంతృప్తి సెగలు.. 14న విజయవాడలో సమావేశం - సీనియర్ ఇంజినీర్లలో అసంతృప్తి సెగలు
Engineers: జల వనరులశాఖలో తాజాగా చోటు చేసుకున్న ఇంజినీర్ల బదిలీలు, అదనపు బాధ్యతల అప్పగింత వ్యవహారంపై సీనియరు ఇంజినీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై విజయవాడలో జులై 14న సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

సీనియర్ ఇంజినీర్లలో అసంతృప్తి సెగలు
ప్రస్తుత బదిలీల్లో 2004, 2005, 2007 బ్యాచ్ ఇంజినీర్లకు వివిధ పోస్టుల్లో జల వనరులశాఖ అధికారులు అదనపు బాధ్యతలను అప్పగించారు. 1990లో ఎంపికైన తమను కాదని జూనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించడంపై సీనియర్ ఇంజినీర్లు అసంతృప్తిగా ఉన్నారు. తమకన్నా 15 ఏళ్ల జూనియర్ల కింద పని చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇన్‌ఛార్జి పోస్టుల్లో పని చేసేందుకు సిద్ధమేనని తెలియజేయాలని సీనియర్లు కొందరు ప్రయత్నిస్తున్నారు. తమ ఇతర సహచరులను కదిలించే సన్నాహాలు చేస్తున్నారు.
ఇవీ చూడండి: