ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పుర పోరు: కొత్త నోటిఫికేషన్‌ వేయాలన్న పిటిషన్ కొట్టివేత - ఏపీ మున్సిపల్ ఎన్నికల అప్​డేట్స్

మున్సిపల్‌ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ వేయాలన్న పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదని అభిప్రాయపడింది.

కొత్త నోటిఫికేషన్‌ వేయాలన్న పిటిషన్ కొట్టివేత
Dismissal of petition seeking new notification for ap municipal elections

By

Published : Mar 9, 2021, 11:37 AM IST

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మళ్లీ నోటిఫికేషన్ వేసి ప్రారంభించాలన్న పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. మున్సిపల్‌ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ వేయాలని కడప వాసుల పిటిషన్‌ దాఖలు చేశారు.

హైకోర్టు తిరస్కరించడంతో.. పిటిషనర్లు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదని జస్టిస్ అశోక్ భూషణ్ అన్నారు. ఎన్నికల నిర్వహణ ఎలెక్షన్ కమిషన్ హక్కు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ABOUT THE AUTHOR

...view details