తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన ‘దిశ’ ఎంతో మంచి మనసు కలిగి ఉండేదని ఆమెకు చదువు చెప్పిన గురువులు గుర్తు చేసుకున్నారు. జరిగిన దారుణంపై భావోద్వేగానికి గురయ్యారు. ఓరుగల్లులో.. ఆమె 8 నుంచి 10వ తరగతి వరకు హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట సమీపంలోని గ్రీన్‌వుడ్ పాఠశాలలో చదివింది. 2006లో ఎనిమిదో తరగతిలో చేరిన దిశ.. వసతి గృహంలో ఉండి చదువుకునేది. పదో తరగతిలో 536 మార్కులు సాధించింది. సహాయ గుణం కలిగిన దిశ పాఠశాల ఇచ్చే మోస్ట్ హెల్పింగ్ స్టూడెంట్పురస్కారానికి నామినేట్ అయిందని పాఠశాల డైరెక్టర్ భరద్వాజనాయుడు చెప్పారు. సేవా గుణం కలిగి ఉండే అమ్మాయి అని అన్నారు.
'దిశ'ది దారి చూపే గుణం.. ఇలా జరగడం ఘోరం! - priyanka reddy case updates
'దిశ' ది సాయం చేసే గుణమని ఓరుగల్లులో ఆమె విద్యనభ్యసించిన పాఠశాల డైరెక్టర్ భరద్వాజనాయుడు తెలిపారు. పాఠశాల ఇచ్చే మోస్ట్ హెల్పింగ్ స్టూడెంట్ పురస్కారానికి నామినేట్ అయినట్లు గుర్తు చేసుకున్నారు. ఆమెపై జరిగిన దారుణంపై తీవ్ర ఆవేదన చెందారు.
disha