'తెలుగు భాష ఉన్నతికి అన్ని చర్యలూ తీసుకుంటాం' - తెలుగు భాషపై కేంద్రం
ప్రాంతీయ భాషల పరిరక్షణకు కేంద్రం చేపడుతున్న చర్యలపై లోక్సభలో కేశినేని నాని అడిగిన ప్రశ్నపై కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ సమాధానమిచ్చారు. తెలుగ భాష ఉన్నతికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
భారతీయ భాషలను పటిష్ఠం చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి పోఖ్రియాల్ అన్నారు. ప్రాంతీయ భాషల పరిరక్షణపై కేంద్రం చేపడుతున్న చర్యలను వివరించాలని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని... అలాంటి ప్రజలు మాట్లాడే తెలుగు రక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారని కేశినేని నాని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తెలుగు భాష ఉన్నతికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రమేశ్ పోఖ్రియాల్ అన్నారు. తెలుగు భాషను పటిష్టం చేసే క్రమంలో మైసూరులోని సంస్థను నెల్లూరుకు మార్చారన్నారు. ఇది నవంబర్ 13 నుంచి పని చేయడం ప్రారంభించిందన్నారు . తెలుగు భాషపై చర్చలు, కార్యశాలలు ఉంటాయని...సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.