ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పునరుత్పాదక ఇంధన సంస్థలకు అత్యధిక బకాయిలున్న రాష్ట్రం ఏపీ' - AP Discoms bills pending

AP Discoms pending bills: రాష్ట్రంలోని డిస్కంలు.. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు రూ. 7,357 కోట్ల బకాయిలున్నట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పార్లమెంటులో తెలిపారు. పునరుత్పాదక ఇంధన సంస్థలకు అత్యధిక బకాయిలున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని పేర్కొన్నారు.

AP Discoms pending bills
AP Discoms pending bills

By

Published : Feb 8, 2022, 11:00 PM IST

AP Discoms pending bills: రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు... విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు రూ. 7,357 కోట్ల బకాయిలున్నట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ పార్లమెంటుకు తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు రూ. 322 కోట్లు, స్వతంత్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు రూ. 408 కోట్లు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థలకు రూ. 6,627 కోట్ల బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ డిస్కంలు రూ. 6,169 కోట్ల బకాయిలు...

తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు రూ. 6,169 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. అందులో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు రూ. 785 కోట్లు, స్వతంత్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు 2,955 కోట్లు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థలకు 2,429 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని సభకు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లోని డిస్కంల బకాయిలు 95,167 కోట్ల రూపాయల మేర ఉన్నట్లు తెలిపారు. పునరుత్పాదక ఇంధన సంస్థలకు అత్యధిక బకాయిలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు పార్లమెంటులో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన సమాధానం ద్వారా వెల్లడైంది.

ఇదీ చదవండి:

power problems in ap: అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంలు... ప్రభుత్వమే కారణం!

ABOUT THE AUTHOR

...view details