ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా ఘాట్ల పనుల్లో అవకతవకలు... నలుగురు ఉద్యోగులపై విచారణ - కృష్ణా పుస్కరాల ఘాట్ల పనుల్లో అవినీతిపై విచారణ

కృష్ణా పుష్కరాల సమయంలో ఘాట్ల నిర్మాణ పనుల అవకతవకలపై నలుగురు ఉద్యోగులపై విజిలెన్సు విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విజిలెన్సు నివేదిక అనంతరం మరిన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అవకతవకలపై విచారణ జరిపేందుకు ఐఏఎస్ అధికారి సిసోడియాను జలవనరులశాఖ నియమించింది.

కృష్ణా ఘాట్ల పనుల్లో అవకతవకలు... నలుగురు ఉద్యోగులపై విచారణ
కృష్ణా ఘాట్ల పనుల్లో అవకతవకలు... నలుగురు ఉద్యోగులపై విచారణ

By

Published : Aug 25, 2020, 6:00 AM IST

కృష్ణా పుష్కరాల ఘాట్ల అభివృద్ధి పనుల్లో అవకతవకలపై నలుగురు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలతో పాటు విజిలెన్సు విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి జలనవరులశాఖ సీఈ వై సుధాకర్ తో పాటు మరో ఇద్దరు సూపరిండింటెండ్ ఇంజినీర్లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్​పై విచారణకు ఆదేశించారు. పుష్కరాల సందర్బంగా వివిధ ఘాట్ నిర్మాణాలకు సంబంధించి అవకతవకలు జరిగినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. వీటిపై విచారణకు ఆదేశించినట్టు స్పష్టం చేసింది. విజిలెన్సు నివేదిక అనంతరం ఉద్యోగులపై మరిన్ని క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

విచారణాధికారిగా సిసోడియా

కృష్ణా పుష్కరాల ఘాట్ల అవకతవకలపై విచారణాధికారిని జలవనరులశాఖ నియమించింది. ఐఏఎస్ అధికారి సిసోడియాకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి :కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు నిర్ణీత ఛార్జీలు

ABOUT THE AUTHOR

...view details