ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Direct Classes: ప్రైమరీ విద్యార్థులకు ప్రత్యక్ష బోధన.. ఎప్పటి నుంచి అంటే! - direct classes for primary schools

కొవిడ్​ మహమ్మారి రెండో దశ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతుల(Direct Classes for Primary Schools)కు దూరంగా ఉన్న ప్రైమరీ విద్యార్థులను.. తిరిగి పాఠశాలలకు రప్పించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. తెలంగాణలో కేసులు తగ్గుముఖం పట్టడంతో దీపావళి తర్వాత 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన సాగనుంది. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపించాయి.

direct-classes-for-primary-schools-will-be-going-to-start-after-diwali-festival-in-telangana
ప్రైమరీ విద్యార్థులకు ప్రత్యక్ష బోధన.. ఎప్పటి నుంచి అంటే!

By

Published : Oct 27, 2021, 11:05 AM IST

దీపావళి తర్వాత 1-5 తరగతుల్లోనూ ప్రత్యక్ష బోధన సాగించాలని ప్రైవేటు పాఠశాలల(Direct Classes for Primary Schools) యాజమాన్యాలు ఇటీవల నిర్ణయించాయి. ఆ మేరకు ఇప్పటికే తల్లిదండ్రులకు సమాచారం పంపాయి. తెలంగాణలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి అన్ని తరగతులనూ ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ తదితర నగర ప్రాంతాల్లోని కనీసం 30-40 శాతం ప్రైవేటు పాఠశాలలు కేవలం 6-10 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను ఆరంభించాయి. మొదట్లో ప్రాథమిక తరగతులనూ మొదలుపెట్టినప్పటికీ, విద్యార్థులు(Direct Classes for Primary Schools) రాకపోవడంతో మళ్లీ రద్దుచేశారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 11 వేల ప్రైవేటు పాఠశాలలు ఉండగా, 10 వేల వరకు ప్రారంభమయ్యాయి. వాటిల్లో ప్రస్తుతం 30-40 శాతం హాజరు నమోదవుతోంది.

అందుకే నిర్ణయం

ప్రత్యక్ష తరగతులు మొదలై దాదాపు రెండు నెలలు పూర్తికావొస్తుండటం, కరోనా కేసులు పెరగకపోవడంతో తల్లిదండ్రులు పిల్లల్ని పంపించేందుకు అభ్యంతరం వ్యక్తం చేయరని యాజమాన్యాలు(Direct Classes for Primary Schools) భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబరులో ప్రాథమిక తరగతులకు కూడా ప్రత్యక్ష తరగతులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌లోని కొన్ని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలలు ఇప్పటికే 9, 10 తరతులకు ఆన్‌లైన్‌ తరగతులను రద్దుచేశాయని, ప్రాథమిక తరగతులకు కూడా ప్రత్యక్ష తరగతులు ఆరంభిస్తే పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారని ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఇస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌రాజు అభిప్రాయపడ్డారు.

20 శాతం హాజరు పెరుగుతుందని అంచనా

ట్రస్మా కోశాధికారి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నవంబరు నుంచి అన్ని తరగతుల్లో ప్రత్యక్ష బోధన(Direct Classes for Primary Schools)ను ప్రారంభించాలని ఇటీవల జరిగిన ట్రస్మా సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుతం కరోనా భయం తగ్గిన నేపథ్యంలో నవంబరులో 20 శాతం హాజరు పెరగవచ్చని అంచనా వేస్తున్నామని ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌ రెడ్డి, మరో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ తెలిపారు. తల్లిదండ్రుల్లో మరింత భరోసా కల్పించేలా వైద్యారోగ్యశాఖ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చదవండి:

APPS FRAUD: యాప్​లతో జాగ్రత్త.. వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తున్న మాయగాళ్లు

ABOUT THE AUTHOR

...view details