Online cinema tickets: ఆన్‌లైన్ విధానం కావాలని ప్రభుత్వాన్ని కోరాం: దిల్ రాజు - ap online cinima tickets
18:45 September 29
సినీ పరిశ్రమను వివాదాలకు దూరంగా ఉంచండి: దిల్ రాజు
ఆన్‌లైన్ విధానం కావాలని పరిశ్రమ తరఫున ప్రభుత్వాన్ని కోరామని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుందన్నారు. గతంలో మా విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని హర్షం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు దిల్ రాజు, డి.వి.వి.దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్ తదితరులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు.
'చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి గతంలోనే సీఎంను కలిశాం. పరిశ్రమపై కొవిడ్ ప్రభావం..సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. దయచేసి అందరూ వివాదాలకు మమ్మల్ని దూరంగా ఉంచండి. గతంలో మా విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆన్‌లైన్ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్‌లైన్ విధానం పారదర్శకంగా ఉంటుంది. మంత్రి నాని సానుకూలంగా స్పందించారు. దాన్ని పూర్తి స్థాయిలో సినీ పరిశ్రమకి వివరించలేకపోయాం. అందుకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి.'- దిల్ రాజు
ఇదీ చదవండి: