ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అదనపు బాధ్యతలతో.. పర్యవేక్షణ కష్టమే..! - sand mining by private company in andhra pradesh

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రైవేట్​ సంస్థ చేపడుతోంది. వీటిపై పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాల గనులు, భూగర్భశాఖ ఉప సంచాలకులు అప్పగించింది. కేవలం మూడు జిల్లాలు మినహా మిగిలిన చోట్ల కింది స్థాయి అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) ఇచ్చి నడిపిస్తున్నారు. తమ విధులను చూసుకుంటూ ఈ అదనపు బాధ్యతలపై దృష్టి పెట్టడం కష్టమవుతోందని వాపోతున్నారు.

sand mining in ap
sand mining in ap

By

Published : Jun 7, 2021, 7:46 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ నిత్యం జిల్లాల వారీగా ఎన్ని రేవుల్లో తవ్వకాలు చేస్తోంది, ఎంత ఇసుక తవ్వితీసింది, ఎంత మేరకు విక్రయాలు జరిపింది.. అనే వివరాలను ఆయా జిల్లాల గనులు, భూగర్భశాఖ ఉప సంచాలకులు (డీడీ) పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే రేవులకు చెందిన అనుమతులు కూడా ఈ అధికారులు చూస్తారు. అటువంటి కీలకమైన అధికారుల పోస్టులు అత్యధిక జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయి. కేవలం మూడు జిల్లాలు మినహా మిగిలిన చోట్ల కింది స్థాయి అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) ఇచ్చి నడిపిస్తున్నారు. దీంతో ఆయా అధికారులు తమ విధులను చూసుకుంటూ ఈ అదనపు బాధ్యతలపై దృష్టి పెట్టడం లేదు.

మూడు జిల్లాలకే..

రాష్ట్రంలోని శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో గనులశాఖ డీడీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళం డీడీకి .. విజయనగరం డీడీగా, తూర్పుగోదావరి జిల్లా డీడీగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఏడీ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. అనకాపల్లిలోని సహాయ సంచాలకుడు (ఏడీ) విశాఖ జిల్లా డీడీగా ఉన్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అక్కడి ఏడీలే డీడీలుగా ఉన్నారు. కడపలో ఎర్రగుంట్ల ఏడీకి, అనంతపురంలో గనులశాఖ ప్రాంతీయ విజిలెన్స్‌ విభాగం ఏడీకి, ఒంగోలు ఏడీకి చిత్తూరు జిల్లా డీడీగా బాధ్యతలు ఇచ్చారు. కర్నూలు, నెల్లూరులోని ఎఫ్‌ఏసీ డీడీలు ఉన్నారు.

ఇసుకపై పర్యవేక్షణ కష్టమే..

అదనపు బాధ్యతలతో ప్రైవేటు సంస్థ చేపడుతున్న ఇసుక కార్యకలాపాలపై పర్యవేక్షణ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు సంస్థకు అప్పగించిన రేవుల్లో ఇసుక నిల్వలు అయిపోతే.. కొత్త రేవులను గుర్తించడం, వాటికి సంబంధించిన అన్ని అనుమతులూ లభించేలా చూడటం, ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో అక్రమాలు జరగకుండా నిఘా ఉంచడం తదితర పనులపై ఇన్‌ఛార్జ్‌ అధికారులు పర్యవేక్షించడం ఎలా సాధ్యమవుతుందని ఆ శాఖలోని అధికారులే ప్రశ్నిస్తుండటం గమనార్హం.

ఇదీ చదవండి:

తొలుత సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ

ABOUT THE AUTHOR

...view details