ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అందుబాటులోకి డయాబెటిక్ వైట్ రైస్ - telangana news

మధుమేహగ్రస్తులకు శుభవార్త. ఆరోగ్యకర బీఫ్యాక్‌ డైట్, డయాబెటిక్ వైట్ రైస్ అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని బీఫాక్‌ సంస్థ కొత్త రకం తెల్ల బియ్యం మార్కెట్‌లోకి విడుదల చేసింది. భారత ధాన్యాగారం ప్రసిద్ధిగాంచిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తైన ఈ బియ్యం వినియోగదారులకు చేరవ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. కీలక పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నాయి. బీఫాక్‌ ప్రైవేటు సంస్థకు లైసెన్సు జారీ చేశాయి.

diobetic rice
diobetic rice

By

Published : Apr 16, 2021, 11:42 AM IST

మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఆరోగ్యకర బీఫ్యాక్ డైట్, డయాబెటిక్​ వైట్​ రైస్ అందుబాటులోకి వచ్చాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి చేసిన ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 - తెలంగాణ సోనా రకం బియ్యం అత్యంత నాణ్యతతో కూడుకుంది. సాధారణంగా రెగ్యులర్‌గా వినియోగించే సాంబా మశూరి - బీపీటీ - 5204తో పోల్చుకుంటే తెలంగాణ సోనా రకం బియ్యం రుచిగా ఉంటుంది. 51.5 గ్లైసోమిక్ ఇండెక్స్ ఇది కలిగి ఉంటుంది.

ఈ రకం బియ్యం మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఉపయుక్తం. మధుమేహగ్రస్తులతోపాటు సాధారణ ప్రజలు కూడా ఈ బియ్యం ఆహారంగా తీసుకోవచ్చు. రోజు వారీ ఆహారంలో ఈ బియ్యం భాగం చేసుకున్నట్లైతే ఉబకాయం తగ్గించుకోవచ్చుని నిరూపితమైంది. బ్రౌన్ రైస్‌తో ఈ బియ్యం సమాన ప్రయోజనాలు కలిగి ఉండటం ఓ ప్రత్యేకత. వినియోగదారుల అభిప్రాయాల మేరకు దేశవ్యాప్తంగా పంపిణీదారులు ఎప్పుడా ఎప్పుడాని ఎదురుచూస్తున్న ఈ బియ్యం విక్రయాలు చేపట్టినట్లు బీఫాక్ స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్‌, ప్లిక్‌కార్ట్‌ ఆన్‌లైన్‌ వేదికగా ఈ బియ్యం లభ్యమవుతున్నాయి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే ఈ బియ్యం కిలో ధర రూ.50 మాత్రమే. ఇప్పుడు చిన్న ప్యాకెట్ రూపంలో మినీ ట్రయల్ ప్యాక్‌ రూ.99 చొప్పున విక్రయిస్తున్నారు. ఆదరణ పొందుతున్న తెలంగాణ సోనా రకం బియ్యం డిస్ట్రిబ్యూషన్ కోసం ఆసక్తిగల అభ్యర్ధులు 8802308802 మొబైల్ నంబర్‌లో సంప్రదించవచ్చని బీఫాక్‌ సంస్థ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:చివరి అంకానికి చేరుకున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక

ABOUT THE AUTHOR

...view details