ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిపై పోరు - రాష్ట్రంలో నిరసనల హోరు - రాజధానిపై పోరు

dharna-for-capital-city
dharna-for-capital-city

By

Published : Dec 24, 2019, 7:19 AM IST

Updated : Dec 24, 2019, 7:52 PM IST

19:23 December 24

రాజధానిగా అమరావతే ఉండాలని...నరసరావుపేటలో కొవ్వొత్తులతో ర్యాలీ

 రాజధానిగా అమరావతే ఉండాలని... గుంటూరు జిల్లా నరసరావుపేటలో కాగడాలు, కొవ్వొత్తులతో తెదేపా నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజాసంఘాలు, రైతులు పాల్గొన్నారు.

19:00 December 24

అమరావతిలో రాజధాని ఉండాలంటూ... తెదేపా శ్రేణుల కాగడాల ర్యాలీ

అమరావతిలో రాజధాని ఉండాలంటూ నగరంలోని బృందావన్ గార్డెన్స్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు  కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.

18:55 December 24

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ... న్యాయవాదుల కొవ్వొత్తుల ర్యాలీ

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ...వెలగపూడి నుంచి రాజధాని రైతులు, న్యాయవాదులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

18:21 December 24

రాజధాని రైతుల ఆందోళనకు నారాలోకేశ్ మద్దతు...మంగళగిరిలో కాగడాల ర్యాలీ

రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా కాగడాల ర్యాలీ నిర్వహిస్తోన్న నారాలోకేశ్

రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా  గుంటూరు జిల్లా మంగళగిరిలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఎమ్ఎస్ఎస్ భవన్ నుంచి సాగిన ఈ ర్యాలీలో... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాల్గొన్నారు.  ఆయనతో పాటు వివిధ ప్రజాసంఘాలు, రైతులు, రైతు కూలీలు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 

18:02 December 24

మీ ఆవేదన అర్థమైంది... : ఉపరాష్ట్రపతి

 కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్​లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రాజధానిప్రాంత రైతులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారకూడదని రైతులు కోరారు. ప్రధాని మోదీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారన్నారు.మీరూ రైతుబిడ్డే..మా కష్టాలు మీకు తెలుసు కదా అని రైతులు  తమ ఆవేదననువెల్లడించారు.తాను రాజకీయాల్లో,ప్రభుత్వంలో లేనని ఆయన సమాధానమిచ్చారు. రాజ్యాంగ పదవిలో ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని పేర్కొన్నారు. ట్రస్ట్ తరఫున ఎలాంటి రాజకీయాలు మాట్లాడకూడదనే నియమం ఉందన్నారు. అయినా రాజధాని రైతుల బాధలు,ఇబ్బందులు తనకు తెలుసునని వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాజధాని కోసం33వేల ఎకరాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేయాల్సింది ఎప్పుడూ చేస్తూనే ఉంటానన్నారు.

  నేను ఏం చేయగలనో...ఏలా చేస్తే మంచి అవుతుందో...మనస్సులో ఉన్న భావాన్ని అర్థం చేసుకున్నాను.

 దాన్ని ఎవరికి, ఏ స్థాయిలో తెలియజేయాలో... నా అభిప్రాయాన్నీ జోడించి వాళ్లకు తప్పనిసరిగా తెలియజేస్తాను: ఉపరాష్ట్రపతి

16:24 December 24

భూమిచ్చిన దంపతుల కాళ్లు కడిగి.. ఆ నీటిని నెత్తిన చల్లుకున్న రైతులు

భూమిచ్చిన దంపతుల కాళ్లు కడిగి.. ఆ నీటిని నెత్తిన చల్లుకున్న రైతులు

మందడం-వెలగపూడిలో రైతు నిరసనలకు భాజపా నేతలు మద్దతు తెలిపారు. రాజధానికి 150 ఎకరాలు ఇచ్చిన సుబ్బారావు, నాగరత్నమ్మ దంపతులకు భాజపా నేత వెలగపూడి గోపాలకృష్ణ సన్మానం చేశారు. సుబ్బారావు, నాగరత్నమ్మ దంపతుల కాళ్లు కడిగి రైతులు నెత్తిన చల్లుకున్నారు. తమ బాధను ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని రాజధాని రైతులు కోరారు. రాజధాని కోసం భూములిచ్చిన వారికి అన్యాయం చేయోద్దని డిమాండ్ చేశారు.

13:22 December 24

జోక్యం చేసుకోండి- అమరావతి రైతులు మోదీకి లేఖ

ప్రధాని మోదీకి రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో లేఖలు రాశారు. రాజధాని అమరావతి విషయంలో తమకు జరిగిన అన్యాయంపై 3పేజీల లేఖలో వివరించారు. తమ ఆధార్ జిరాక్స్ కాపీలను లేఖలకు జోడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రధాని జోక్యం కోరుతూ పెద్ద సంఖ్యలో లేఖలను ప్రధాని కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ చేశారు.

13:02 December 24

తుళ్లూరు దీక్ష శిబిరాన్ని సందర్శించిన భాజపా నేత విష్ణువర్దన్‌రెడ్డి

తుళ్లూరు దీక్ష శిబిరాన్ని సందర్శించిన భాజపా నేత విష్ణువర్దన్‌రెడ్డి

రాజధాని రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపిన విష్ణువర్దన్‌రెడ్డి

12:57 December 24

హైకోర్టును అమరావతిలోనే ఉంచాలంటూ చలో హైకోర్టుకు న్యాయవాదుల ర్యాలీ

హైకోర్టును అమరావతిలోనే ఉంచాలంటూ చలో హైకోర్టుకు న్యాయవాదుల ర్యాలీ చేపట్టారు. విజయవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో .. న్యాయవాదులకు తెదేపా నేతలు దేవినేని ఉమ, బోండా ఉమ మద్దతు తెలిపారు. హైకోర్టు కర్నూలుకు తరలిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని న్యాయవాదుల ఐకాస తెలిపింది. 3 రాజధానులతో పాటు హైకోర్టు తరలింపు యోచనను విరమించుకోవాలని సూచించింది. జీఎన్ రావు కమిటీకాదు.... ఇది జగన్ కమిటీ అని దేవినేని ఉమ ఆరోపించారు. ముఖ్యమంత్రి వెంటనే ప్రకటన వెనక్కి తీసుకుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు తెదేపా పూర్తిస్థాయి మద్దతు ఉంటుందన్నారు.

12:35 December 24

అమరావతి రైతులులకు పలు గ్రామాల ప్రజల మద్దతు

రాజధాని రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలియజేస్తూ పలు గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.తాడికొండ మండలం మోతడక గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి మారినప్పుడుల్లా..రాజధాని మారుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వంటావార్పు కార్యక్రమం చేపట్టి ఆందోళన తెలియజేశారు.రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు మంగళగిరి మండలం నిడమర్రు,కురగల్లు గ్రామాలలో రైతుల ధర్నా లు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.ఎక్కడికక్కడే రోడ్లపై బైఠాయించారు.రాజధాని తరలిస్తే తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని రైతులు వాపోయారు. రాజధానిపై స్పష్టత వచ్చే వరకు ఆందోళనలు విరమించేదిలేదని స్పష్టం చేశారు.

12:32 December 24

'భూములు త్యాగం చేస్తే..మా పిల్లలను ఏడిపిస్తున్నారు'

రాజధాని మార్పు ప్రతిపాదనలపై రైతుల నిరసనలో....పిల్లల ఏడ్పులూ వినిపిస్తున్నాయి.భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని రాజధాని నిర్మాణానికి త్యాగం చేస్తే...తమ పిల్లలను వేధనకు గురిచేస్తున్నారని....రైతులు మండిపడుతున్నారు.అమరావతిపై ఆందోళనతో రోడ్డున పడ్డామంటున్న రైతులు....ప్రభత్వం తగ్గేవరకూ నిరసన విరమించేది లేదంటున్నారు.

11:51 December 24

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని బీసీ సంఘనాయకుల డిమాండ్‌

అమరావతనే రాజధాని కొనసాగించాలని BCసంక్షేమం సంఘం నాయకులు కృష్ణాజిల్లా నందిగామలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులు వద్దని....అటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. అందరికి అనువైన రాజధాని అమరావతేనని వారు తెలిపారు. 

11:30 December 24

పురుగుమందు డబ్బాలతో ధర్నాలో కూర్చున్న రైతులు

మందడంలో రైతులు, మహిళలు, రైతుకూలీల ధర్నాలో పాల్గొన్నారు. పరిసర గ్రామాల నుంచి భారీగా రైతులు తరలివచ్చారు. పురుగుమందు డబ్బాలతో ధర్నాలో కూర్చున్నారు రైతులు.

11:30 December 24

అమరావతి: తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి మహిళల ఫిర్యాదు

తమ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించటం లేదంటూ తుళ్లూరులో మహిళలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతంలో వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించటం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆచూకీ తెలియజేయాలంటూ.......ర్యాలీగా వెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

11:11 December 24

తాడికొండలో రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని అక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు.నిరసనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.తాడికొండ మండలంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.మహిళలు,పిల్లలు,వృద్ధులు ధర్నాలో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

11:11 December 24

'మమల్ని తెలంగాణలో కలపండి'

రాజధాని మార్పు ప్రతిపాదనలను నిరసిస్తూ.....అమరావతి ప్రాంత రైతుల ఆందోళన,నిరసనలు కొనసాగుతున్నాయి.రాజధాని పరిధిలోని29గ్రామాల్లోనూ....రైతులు వివిధ రూపాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మందడంలో రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.చొక్కాలు తీసి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.జగన్ పరిపాలన తమకొద్దంటూ నినాదాలు చేశారు.జగన్ కు ఓటేసినందుకు తమ చెప్పులతో కొట్టుకున్నారు.కృష్ణా,గుంటూరు జిల్లాలను తెలంగాణాలో కలుపుకుని న్యాయం చేయండని కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

10:20 December 24

మందడంలో వివిధ రూపాల్లో నిరసనలు

మా శ్వాస అమరావతి...మా ఆధారం అమరావతి....ఇదే నినాదంతో అమరావతి రైతుల నిరసనలు ఏడోరోజూ ఉద్ధృతంగా సాగుతున్నాయి.అమరావతినే రాజధానిగా కొనగించాలంటూ....మందడంలో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగులు,రైతులు,సామాన్యులు.....ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని లేవనెత్తుతూ...రాజధాని మార్పు ప్రతిపాదనలపై మండిపడుతున్నారు.చావనైనా చస్తాం కానీ....ఆశలు కల్పించి ఇప్పుడు తరలిస్తాంటే...ఒప్పుకొనేది లేదని వాపోతున్నారు.

09:54 December 24

రాజధాని రైతులకు సంఘీభావంగా గుంటూరు జిల్లాలో రైతుల ఆందోళన

రాజధాని రైతులకు సంఘీభావంగా గుంటూరు జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతుల నిరసన తెలిపారు.

రైతుల ఆధ్వర్యంలో వంటావార్పు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

09:37 December 24

తుళ్లూరులో నల్లదుస్తులతో దీక్షలో పాల్గొన్న రైతులు, మహిళలు

తుళ్లూరులో నల్లదుస్తులతో దీక్షలో పాల్గొన్న రైతులు, మహిళలు

తుళ్లూరులో నిరసన దీక్షలో  రైతులు, మహిళలు పాల్గొన్నారు. నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు.

09:36 December 24

మంగళగిరి మండలం నిడమర్రులో రైతుల ధర్నా

మంగళగిరి మండలం నిడమర్రులో రైతులు ధర్నా చేపట్టారు. రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

09:10 December 24

మందడంలో రైతుల అర్ధనగ్న ప్రదర్శన

అమరావతిలోని మందడంలో రైతుల అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చొక్కాలు తీసి రహదారిపై బైఠాయించి  నిరసన తెలిపారు.

08:40 December 24

మందడం రహదారిపై అడ్డంగా టెంట్ వేసిన గ్రామస్థులు

అమరావతిలోని మందడం రహదారిపై గ్రామస్థులు అడ్డంగా టెంట్ వేశారు. గ్రామస్థులు టెంట్‌ వేయడంతో సచివాలయానికి  రాకపోకలు నిలిచిపోయాయి.

08:36 December 24

సచివాలయానికి వెళ్లే మందడం-మల్కాపురం జంక్షన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

సచివాలయానికి వెళ్లే మందడం-మల్కాపురం జంక్షన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సచివాలయం వైపు వెళ్లే ప్రతీ వాహనం తనిఖీ చేసి వివరాలు నమోదు చేస్తున్నారు. గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు.

08:09 December 24

విజయవాడ: సేవ్ అమరావతి పేరిట సిద్ధార్థ వాకర్స్ నిరసన ర్యాలీ

విజయవాడలో.. సేవ్ అమరావతి పేరిట సిద్ధార్థ వాకర్స్ నిరసన ర్యాలీ చేపట్టారు. విజయవాడ సిద్ధార్థ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

08:07 December 24

ఏడో రోజూ ఆందోళనలు.. తుళ్లూరులో అడ్డుకున్న పోలీసులు

ఏడో రోజూ ఆందోళనలు.. తుళ్లూరులో అడ్డుకున్న పోలీసులు

రాజధాని కోసం అమరావతి పరిధిలోని రైతుల ఆందోళనలు ఇవాల్టికి ఏడో రోజుకు చేరాయి. తెల్లవారుఝామునే తుళ్లూరులో రైతులు నిరసన మొదలు పెట్టారు. టెంట్ వేసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకుంటూ పోలీసులు ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా.. రైతులు మాత్రం తమ ప్రయత్నాలు ఆపలేదు. చలికి లెక్క చేయక ఆందోళనను కొనసాగించేందుకు తమ ప్రయత్నాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ నిరసనలు, ఆందోళనలు ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు.

08:05 December 24

విజయవాడ: సేవ్ అమరావతి పేరిట నగరంలో సిద్ధార్థ వాకర్స్ నిరసన ర్యాలీ నిర్వహించారు. సిద్ధార్థ కళాశాల నుంచి ప్రదర్శనగా వెళ్లారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

07:04 December 24

రాజధానిపై పోరు - రాష్ట్రంలో నిరసనల హోరు

అమరావతి రైతుల ఆందోళనలు, నిరసన దీక్షలు ఏడోరోజుకు చేరింది. ఉదయం 8.30 గంటలకు కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్ష,  వెలగపూడి, మందడంలో రైతుల ధర్నా చెపట్టనున్నారు.  తుళ్లూరులో మహాధర్నా కొనసాగుతోంది. 29 గ్రామాల్లోనూ ఏ గ్రామానికాగ్రామన రైతులు నిరసనలు తెలుపుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజా సంఘాలు నిరసనలు తెలపనున్నారు. చలో హైకోర్టుకు న్యాయవాదులు పిలుపు నిచ్చారు. ఆత్కూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో రాజధాని రైతుల భేటీ కానున్నారు. రాజధాని రైతులు గవర్నర్‌ ను కలిసేందుకు సమయం కోరారు.

Last Updated : Dec 24, 2019, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details