D Srinivas to Join Congress : తెలంగాణలో తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. గురువారం సాయంత్రం దిల్లీలోని సోనియా నివాసానికి వెళ్లిన డీఎస్ సుమారు 40 నిమిషాలపాటు ఆమెతో భేటీ అయ్యారు. పార్టీలో చేరేందుకు ఆసక్తిచూపగా, అందుకామె అంగీకారం తెలిపారు.
D.Srinivas to Join Congress : సోనియా గాంధీతో డీఎస్ భేటీ.. త్వరలో సొంతగూటికి! - కాంగ్రెస్ గూటికి డీఎస్
D Srinivas to Join Congress : తెలంగాణలో తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం ఆయన దిల్లీలో సోనియా గాంధీని కలిశారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపగా.. ఆమె అంగీకారం తెలిపారు.
D.Srinivas Met Sonia Gandhi : సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన డీఎస్ రాష్ట్ర మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెరాసలో చేరారు. 2016లో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఆయన్ను రాజ్యసభకు పంపారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది జూన్ వరకు ఉంది. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ గతంలో నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత సహా ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు..తెరాస అధినేత కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు, పార్టీకి మధ్య దూరం పెరిగింది.
D.Srinivas To join in Congress : 2019లో డీఎస్ కుమారుడు అర్వింద్ నిజామాబాద్‌లో కవితపై గెలుపొందడంతో అది మరింత ఎక్కువైంది. కొంతకాలంగా ఏ కార్యక్రమాలకూ ఆయన్ను ఆహ్వానించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. త్వరలోనే ఆయన రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవంగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆయన సోనియాను ఒకసారి కలిశారు. అప్పుడే కాంగ్రెస్‌లో చేరతారని భావించినప్పటికీ ఆయన చేరలేదు.