ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NO VACCINE - NO RATION: 'టీకా తీసుకోని వారికి నవంబర్ 1 నుంచి రేషన్, పింఛన్‌ బంద్'

కరోనా టీకా(corona vaccine) తీసుకోని వారికి తెలంగాణలో రేషన్, పింఛన్ నిలిపివేస్తామని డీహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు. నవంబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.

dh-srinivas-warned-to-suspend-ration-and-pension-those-who-did-not-take-corona-vaccine
'టీకా తీసుకోనివారికి నవంబర్ 1 నుంచి రేషన్, పింఛన్‌ బంద్'

By

Published : Oct 26, 2021, 11:49 AM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తి(corona virus) తగ్గుముఖం పట్టింది. మూడో ముప్పు(covid third wave) పొంచి ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాస రావు(telangana DH srinivas rao) సూచించారు. ప్రజలంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.

కరోనా టీకా(corona vaccine) తీసుకోని వారికి రేషన్, పింఛన్ నిలిపివేస్తామని డీహెచ్ శ్రీనివాస రావు హెచ్చరించారు. నవంబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ప్రజలు టీకా తీసుకుని మహమ్మారి నుంచి అప్రమత్తంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మూడో ముప్పు దగ్గర్లోనే ఉందని.. అందరు మాస్కులు తప్పక ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details