ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లైంగిక నేరగాళ్ల జాబితాకు రూపకల్పన: డీజీపీ - dgp goutham sawang latest updates

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ అన్నారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

లైంగిక నేరగాళ్ల జాబితాకు రూపకల్పన: డీజీపీ
లైంగిక నేరగాళ్ల జాబితాకు రూపకల్పన: డీజీపీ

By

Published : Dec 17, 2019, 6:45 AM IST

లైంగిక నేరాలకు పాల్పడే నేరగాళ్ల జాబితాను తయారు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ అన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, న్యాయ శాఖ, సీఐడీ, ఫోరెన్సిక్​ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షలో డీజీపీ మాట్లాడారు. డయల్​ 100, 112 లపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. 2020 సంవత్సరాన్ని పోలీసుశాఖ పరంగా మహిళా మిత్ర సంవత్సరంగా పరిగణిస్తామన్నారు. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు వన్​ స్టాప్​ సెంటర్​ను వినియోగించాలని ప్రజలను కోరారు. ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నారు. వారంలో కేసు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. మహిళా మిత్ర, సైబర్​ మిత్రల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. క్షేత్ర స్థాయిలో ఆధారాలు సేకరించటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మహిళలు ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్​ స్టేషన్​ వచ్చే క్రమంలో ఎదురవుతున్న సమస్యలను తగ్గించాలని డీజీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details