మహిళలు, చిన్నారులపై( CASES ON CHILDREN'S AND WOMEN'S) నమోదైన కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి సకాలంలో అభియోగపత్రాలు(charge sheet) దాఖలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు(AP POLICE) దేశంలో మొదటి స్థానంలో నిలిచారని పోలీసు ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 2018లో 13.47 శాతంగా ఉన్న అభియోగపత్రాల దాఖలు రేటు.. 2021 నాటికి 93.8 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ పురోగతికి సాంకేతిక పరిజ్ఞానం అందించినందుకు సాంకేతిక సేవల విభాగం డీఐజీ పాలరాజు, సిబ్బందిని డీజీపీ గౌతమ్ సవాంగ్‌బుధవారం అభినందించారు.
AP DGP: ఏపీ దేశంలోనే టాప్.. సిబ్బందికి డీజీపీ అభినందన - మహిళలపై నేరాల్లో త్వరగా ఛార్జ్ షీట్లు
మహిళలపై, చిన్నారులపై( CASES ON CHILDREN'S AND WOMEN'S) నమోదైన కేసుల్లో రాష్ట్ర పోలీసులు సకాలంలో అభియోగ పత్రాలు(charge sheet) దాఖలు చేస్తున్నారని పోలీసు ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది.
dgp savang appreciate technical wing